Dayle Breaking News

వరల్డ్ రికార్డు కైవసం చేసుకున్న చిన్నారులు, సత్కరించిన ఆర్య వైశ్య సంఘం

అమరావతి న్యూస్, పొదిలి

0 259

పొదిలి పట్టణం లో శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఉదయం నగర సంకీర్తన తో మొదలై రాత్రి అమ్మవారి పల్లకి ఊరేగింపు తో ఘనంగా జరిగింది. అదేవిధంగా ఐ సి యం డి ఎ, చెన్నై వారు డిసెంబర్ నెలలో ఆన్ లైన్ లో నిర్వహించిన నృత్య పోటిలలో భాగంగా పొదిలి పట్టణానికి సంబంధించిన డాన్స్ మాస్టర్ శివశంకర్ గారి శిష్య బృందం 10 వరల్ రికార్డ్స్ ను గెలుచుకొంది. ఈ రికార్డ్స్ సాధించిన మామిడి తన్మయ,  దుర్గంపుడి చైతన్య రెడ్డి, గంగవరపు విజయలక్ష్మి, మాలపాటి  శ్రీవిద్య లను శ్రీ వాసవి మత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తుల మధ్య ఆర్య వైశ్య సంఘం అద్వర్యంలో రికార్డ్స్ సాధించిన చిన్నారులకు దుస్సాలువ తో సత్కరించి శుభాస్సిసులు అందచేసారు. గురువు గారికి అభినందనలు తెలియ జేసారు.  గునుపూడి చెంచు సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ చిన్నారులు అయిగిరి నందిని అనే పాటకు దాదాపు 7౦౦౦ మంది నృత్యం చేయగ వారిలో వీరు 10 రికార్డ్స్ గెలవడం చాల ఆనందంగా ఉందని కళలు ను చిన్నారులకు చిన్న వయస్సు నుండే నేర్పించడం వలన మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు విలువలు పెరగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి సి సుబ్బారావు, వేమా కృష్ణమూర్తి సామిరాజ, మేడా నరసింహ రావు, పమిడిమర్రి శ్రీను, భూమా సుమంత్, అప్పల సత్యం, సామీ సత్యం, రావూరి నాగ రాజు, చేపూరి నాగరాజు, మునగ సత్యం  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.