Dayle Breaking News

పెన్సిల్ లెడ్లపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర.

- లిఖించిన "సూక్ష్మ కళాకారిణి" అన్నం మహిత. - 18న పెనుగొండ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి సమర్పణ.

0 30

 

ఒంగోలు::

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బాపట్ల జిల్లా, చీరాల, స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం నరసింహారావు భ్రమరాంబ దంపతుల కుమార్తె “సూక్ష్మ కళాకారిణి” అన్నం మహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై ఆంగ్ల భాషలో లిఖించింది. ఆ చిత్రపటాన్ని ఒంగోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అన్నం మహిత మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి జీవిత చరిత్రను లిఖించాలనుకున్నాను, అమ్మవారి కృపతో ఇప్పటికీ నా సంకల్పం నెరవేరింది, 18వ తేదీ ఈ చిత్రపటాన్ని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలో ఈ చిత్రపటాన్ని పూర్తి చేశానని నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సూక్ష్మ ఖండాల తయారీ చేస్తున్నాను. గతంలో 720 పెన్సిళ్లపై భగవద్గీత పూర్తి శ్లోకాలను అలాగే పొట్టి శ్రీరాములు వారి జీవిత చరిత్ర, నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర, అక్కినేని నాగేశ్వరావు జీవిత చరిత్ర, కరుణానిధి జీవిత చరిత్ర ఇలా ఎన్నో… గొప్ప వారి జీవిత చరిత్రలు రాసి వారి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో సూక్ష్మ కళాకారిణిగా ఎదుగుతున్నానని, ప్రతి ఒక్కరూ నా కళను ఆదరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.