Dayle Breaking News

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభం.

- పెద్ద సంఖ్యలో కలశ శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు.

0 26

ఒంగోలు::

ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైనవి. వైశాఖ శుద్ధ దశమి గురువారం 16వ తేదీ ఉదయం స్థానిక రంగారాయుని చెరువు నుండి 108 కలశములతో ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలమును “శోభాయాత్ర” గా తీసుకొని వచ్చారు.

డాక్టర్ చావల ప్రకాష్ వాసవి పతాకను ఆవిష్కరించారు. తదుపరి శోభాయాత్రగా తీసుకుని వచ్చిన అభిషేక జలముతో అమ్మవారికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరణ ప్రత్యేకమైన పూజా నిర్వహించారు. వాసవి ఆలయ తదియారాధన సంఘం సభ్యులు కార్య నిర్వహణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.