Dayle Breaking News

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు* *… జనసైనికులు కృషి అభినందనీయం*

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు* *... జనసైనికులు కృషి అభినందనీయం*

0 97

*పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు*
*… జనసైనికులు కృషి అభినందనీయం*
పిఠాపురం (అమరావతి న్యూస్) పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం గోకుల్ గ్రాండ్ హోటల్ లో జనసేన పార్టీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు, పిఠాపురం ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ ,గంటా స్వరూప, కడారి తమ్మయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రకటించిన తర్వాత నుంచి జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులు స్వచ్ఛందంగా ఆయన గెలుపు కోసం కృషి చేశారని వారు చేసిన కష్టాన్ని ఎప్పటికీ మరువమని తెలియ చేశారు. నిన్న జరిగిన ఎలక్షన్స్ లో జనసైనికులు పాత్ర చాలా కీలకమైంది అని తెలియజేశారు రాత్రి 9 గంటలైనా పోలింగ్ బూత్ల వద్ద అలా నిలబడి ఉన్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజవర్గాన్ని దేశంలోనే అత్యున్నతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతారని తెలియజేశారు. పిఠాపురం ఇంచార్జ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని తెలియజేశారు. జనసేన పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారని జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు చేశారని తెలిపారు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కి పూర్తిగా మద్దతు తెలిపారని చెప్పారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవాలని కసిగా నెగ్గించుకోవాలని ప్రేమతో పని చేశారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.