Dayle Breaking News

పిఠాపురం ప్రజలు ప్రేమతో ఓటేశారు

0 63

*పిఠాపురం ప్రజలు ప్రేమతో ఓటేశారు*

*… జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు*
గొల్లప్రోలు (అమరావతి న్యూస్) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఓటింగ్ కూడా పూర్తయిపోయింది ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఓటు వేశారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తునట్లు ప్రయత్నించినప్పుడే పవన్ గెలుపు తద్యమని తెలిపారు. పిఠాపురం ప్రజలు తన సొంత మనిషిగా భావించి పవన్ కళ్యాణ్ ని అభిమానం ప్రేమతో ఓటు వేశారని నాగబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని పేర్కొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళలకు మిత్రులకు స్నేహితులకు కృతజ్ఞతలు నాగబాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.