Dayle Breaking News

పెత్తందారులను తరిమికొట్టి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం – టీడీపి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు

0 9

_*డా౹౹చదలవాడ అరవింద బాబును ఎమ్మెల్యేగా గెలిపిస్తాం*_

_*చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటాం*_

_*పెత్తందారుల్ని తరిమికొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం*_

_*నరసరావుపేట ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నల్లపాటి రాము ఛాలెంజ్*_

_నరసరావుపేట రూరల్

_కూటమి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పేర్కొన్నారు.నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పట్టణంలోని ప్రముఖ వైద్యులతో కలిసి ఎన్నికల ప్రచారం చేసారు.జగన్ రెడ్డి పాలనంత ధరలబాదుడు చార్జీలకు గుడ్డు తప్ప ఏమీ లేదన్నారు.విద్య వ్యవస్థను నాశనం చేశారు.ఉద్యోగ నియామకాలు లేక, పరిశ్రమలు రాక,పెట్టుబడులు తరిమేసి యువతను రోడ్డున పడేశారు.రైతులకు గిట్టుబాటు ధరలు లేవున్నారు.కూలీలకు కనీసం పనులు కూడా లేవు,ఉద్యోగులకు కనీసం జీతాలు సకాలం ఇవ్వక,వృద్ధులకు పెన్షన్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వండి అంటున్నాడన్నారు.ప్రజలు పిచ్చోళ్ళు అనేలా వ్యవహరిస్తున్నాడని,ఈ సైకో రెడ్డిని రాష్ట్రం నుండి తరిమెందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాము తెలిపారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డా౹౹చదలవాడ అరవింద బాబుని,ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటామన్నారు.జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారని హెచ్చరించారు.రాష్ట్రాన్ని నాశనం చేసి మరో ఛాన్స్ అని ఏ విధంగా అడుగుతున్నారో కాస్తయినా ఆలోచించుకోవాలని అన్నారు.జగన్ రెడ్డి లాంటి సైకో మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని యువత మొత్తం పొరుగు రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.బాబుని గెలిపించుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటామని నల్లపాటి రాము సవాల్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.