Dayle Breaking News

టీడిపి అభ్యర్థి డాక్టర్ చదలవాడ సమక్షంలో పొనుగుపాటి పూర్ణ చంద్రరావు అధ్వర్యంలో టీడీపీలో భారీగా చేరికలు

0 7

పొనుగుపాటి పూర్ణచంద్రరావు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు.

ఎస్సి,ఎస్టీ,బిసి ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ పొనుగుపాటి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా డా౹౹చదలవాడ అరవింద బాబును,ఎంపీగా అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక తరఫున 175 నియోజక వర్గాల్లో కూటమిని గెలిపించుకుంటామన్నారు.అన్ని వర్గాల ప్రజలు కూటమిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజక వర్గం అభివృద్ధి,రాష్ట్ర సుస్థిరాభివృద్ది నారా చంద్రబాబుతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా,ప్రజలకు ఎవరయితే మేలు చేస్తారో వారికి ఓటు వేయాలని డా౹౹చదలవాడ పిలుపు నిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.