Dayle Breaking News

ధర్మవరంలో బిజెపి విజయం తథ్యం – సాయికుమార్

ప్రకాశం మహిళా మోర్చా నేతలను అభినందించిన సాయి కుమార్

0 81

ఒంగోలు/ధర్మవరం ::

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ నాయకులు వై సత్య కుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తారని సినీ యాక్టర్ సాయికుమార్ మంగళవారం పేర్కొన్నా రు. సత్యకుమార్ విజయం కోరుచూ ధర్మవరంలో ఒకటో వార్డులో వీధి వీధి, డోర్ టు డోర్ ప్రచార నిమిత్తం సత్య కుమార్ విజయ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రకాశం మహిళా మోర్చా నేతలను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు, ప్రకాశం నేతల పనితీరు వారి ప్రచారం లోనే తెలుస్తుందని సాయికుమార్ ఈ సందర్భంగా తెలిపినారు. ధర్మవరం దశ దిశ మారాలి అంటే సత్య కుమార్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని, వారు శసనసభలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే ధర్మవరం రూపురేఖలు మారుతాయని ఈ సందర్భంగా ప్రకాశం మహిళా నేతలు సాయికుమార్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు నేతృత్వంలో భాజపా జిల్లా కార్యదర్శి మరియు భాజపా మహిళా మోర్చా జిల్లా ఇన్చార్జి తీగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి పాల్గొని ధర్మవరంలోని ఒకటో వార్డు/ వీధిలో ఇంటింటి ప్రచారం తమదైన శైలిలో కొనసాగించారు.

Leave A Reply

Your email address will not be published.