Dayle Breaking News

పిల్లలతో గడపడం వారి మానసిక పరిపక్వత అభివృద్ధికి దోహదపడుతుంది.

- బిఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె. దిలీప్ కుమార్ రెడ్డి. - ఘనంగా కిండర్ గార్టెన్ మైల్ స్టోన్ ఈవెంట్.

0 424

ఒంగోలు::

ప్రతిరోజు పిల్లలతో గడపడం, వారి బాగోద్వేగాలను తెలుసుకోవడం, వారిలో వచ్చే సందేహాలను వారికి అర్థమయ్యే రీతిలో తెలియచెప్పడం వలన వారిలో ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస పెరుగుతుంది, తద్వారా తల్లిదండ్రులుగా ఎన్నో విషయాలను మనం కూడా తెలుసుకోవడం జరుగుతుందని బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపల్ కే దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం సాయంత్రం స్కూల్ ప్రాంగణంలో యూకేజీ విద్యార్థుల కాన్వకేషన్ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రేపటి నుండి వేసవి సెలవులు ఉన్న కారణంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలని, వారిని ప్రతి చోటకి తీసుకుని వెళుతూ ఆయా విషయాలను వారికి తెలుపుతూ ఉండాలని, అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలను, ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ నీడ పట్టున వారు ఉత్సాహంగా ఉండేటట్లు, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా తల్లిదండ్రులుగా బాధ్యత నెరపాలని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ జీవిత ఉత్తానపథం గురించి వివరించారు.

కార్యక్రమంలో భాగంగా యూకేజీలో ఉన్నతంగా రాణించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందించి అభినందించారు. తమ విద్యా సంస్థ విద్యార్థులకు అన్ని రంగాలలో నిష్ణాతులయ్యే విధంగా కృషి చేస్తూ ఉన్నత విద్య అభ్యసించిన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయడం తమ పాఠశాల ప్రత్యేకతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా గీతాలకు నృత్యాలు చేశారు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.