Dayle Breaking News

శివనామ స్మరణతో మార్మోగిన రథోత్సవ ప్రాంగణం

0 295

శివ నామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

భారీగా హాజరైన భక్తులు

మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం త్రిపురాంతక క్షేత్రంలో ఆదిదేవుడి రథోత్సవం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి ఉత్స వాలలో మూడవరోజైన ఆదివారం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యా హ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో మోసుకొని రథం వద్దకు తీసుకొచ్చారు.రథపూజా కార్యక్రమాన్ని రధ కమిటీ ఆధ్వర్యంలోనిర్వహించారు…ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి,ఆలయాల ఛైర్మన్ యిమ్మడిశెట్టి.వెంకట సుబ్బారావు,ఎంపీపీ సుబ్బారెడ్డి,సర్పంచ్‌ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో వేదపండి తులు,అర్చకులు విశ్వ నారాయణ శాస్త్రి, ప్రసాద్‌ శర్మ లు పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు.రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.శివ నామస్మరణతో రథోత్సవ ప్రాంగణం మారుమోగింది. డీఎస్పీ అశోకవర్ధన్ ,సీఐ సుబ్బారావు,ఎస్‌ ఐ సాంబ శివయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు.అన్ని సంఘాల సత్రాలవారు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు భోజన సౌకర్యాలు కల్పించారు.వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలను ఏర్పాటు చేశారు.రథోత్సవం సందర్భంగా పలువురు దాతలు భక్తులకు శీతలపానీయాలను,మజ్జిగను పంపిణీ చేశారు.….

Leave A Reply

Your email address will not be published.