Dayle Breaking News

ఆర్ ఎం పి , పి ఎం పి గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం తిరుమల తిరుపతి పాదయాత్ర

0 581

తిరుమల తిరుపతి పాదయాత్ర.
ఆర్ ఎం పి మరియు పి ఎం పి గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం.
ఉమ్మడి విశాఖ జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామ గ్రామీణ వైద్యులు శలాపు శ్రీనివాసరావు బృందం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి పాదాలకు వినతిపత్రం సమర్పించటాని పాదయాత్రగా బయదేరారు.
ఆరు దశాబ్దాలుగా గ్రామీణ&పటణ మురికివాడల్లో ప్రధమ చికిత్సలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమం చేయలేదు.వీరి వృత్తికి ఏ రకమైన గుర్తింపు ఇవ్వలేదు.
అనేక మార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ అనేక వినతిపత్రాలు అందజేసినారు.
2009 లో అప్పటి ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి వీరిని కమ్యూనిటీ పారామెడిక్స్ గా గుర్తిస్తూ 429 జిఓ ను విడుదల చేసి జిల్లా ఆసుపత్రిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.కానీ ఆయన మరణం తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ జిఓ ను ఒక మెమోతో రద్దు చేశారు.
ఆ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని గుర్తిస్తూ మరోక అక్టోబర్ 22, 2017 లో జిఓ 465 విడుదల చేశారు కాని ఆ జిఓ కార్యరూపం దాల్చలేదు.
తదుపరి 2018 లో ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలో మీకు గుర్తింపు ఇస్తామని అర్హత గల వారికి ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాలుగా అనేక వినతులు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఏమి స్పందించ లేదు.ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు స్పందించని కారణంగా భగవంతునికే వినతిపత్రం సమర్పించాటాని పాదయాత్రగా బయలుదేరారు.ఆ వేంకటేశ్వర స్వామి అయిన వీరి యందు కరుణించి ఈ ప్రభుత్వ పెద్దలకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తున్నారు.వీరి పాదయాత్రకు రహదారి పొడవున గ్రామీణ వైద్యులు సంఘీభావం తెలియ జేస్తున్నారు. విజయవాడ లో సంఘీభావం గా సి ఎచ్ వెంకటేశ్వర రావు, ఉమా మహేశ్వర రావు, నేషనల్ గ్రామీణ వైద్యుల సంఘ అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ కలిసి సహయ సహకారాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.