Dayle Breaking News

*సౌందర్య లహరి ఛాలెంజ్ 2024 పోటీలు*

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంప్రదాయ పోటీలు*

0 476

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
సౌందర్య లహరి ఛాలెంజ్ 2024 పోటీలు*

*దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న వనితలు.

*హిందూ సంప్రదాయాలను ప్రపంచానికి చాటినట్లైనది.*

First prize : శ్వేతా,కొవ్వూరు,తూర్పు గోదావరి జిల్లా

Second prize :శైలజ ,కనిగిరి,ప్రకాశం జిల్లా

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Third prize. :ప్రసన్న , దర్శి,ప్రకాశం జిల్లా

 

అమరావతి న్యూస్, అంగన స్పెషల్.

ఆ… అమరావతి ఆ… ఆంగన సౌందర్యలహరి 2024 ఛాలెంజ్ పేరిట అంతర్జాతీయ మహిళా దినోత్సవమును పురస్కరించుకొని అమరావతి న్యూస్ ఛానల్ మహిళల కోసం నిర్వహించిన సాంప్రదాయక పోటీ అత్యంత ఆదరణ పొందింది దేశ విదేశాల నుండి మహిళా మణులు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వివరించారు.

*భారతీయ సంస్కృతిలో మహిళల ప్రాధాన్యత:*

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత” ఎక్కడైతే మహిళలు పూజించబడతారో/ గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారని మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన విశ్వాసం. స్త్రీ మూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం. భారతీయ సనాతన ధర్మంలో పురుషుని కంటే మహిళకు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. మహిళలు కూడా అదే విధంగా తమ కార్యాచరణను నిర్వహిస్తూ ఉండేవారు. పురుషులు కుటుంబ పోషణ, సేద్యం తదితర కార్యాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ సమయంలో మహిళలు కత్తి సామునేర్చి రాజ్యాలు ఏలారు. తమ రాజ్యాలపై దండెత్తి వచ్చిన ధూర్తులను తుదముట్టించారు. అంతేకాకుండా మన సాంప్రదాయంలో యజ్ఞ యాగాదుల క్రతువులు చేయాలన్న స్త్రీ మూర్తి పక్కన లేకుండా పురుషులు నిర్వర్తించేవాడు కాదు, నిర్వర్తించడానికి యోగ్యత ఉండేది కాదు. ఉదాహరణకు రాజసూయ యాగం చేయడానికి శ్రీ రామచంద్రుడు స్వర్ణ సీతాదేవిని పక్కన ఉంచుకొని ఆ యాగాన్ని నిర్వర్తించాడు అని మనం చదువుకున్నాం. అలాగే రాణి రుద్రమదేవి, మగువ మాంచాల, రాణి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా ఎందరో రాణులు రాజ్యాలను ఏలారు. చరిత్రపుటల్లో వీరనారీమణులుగా వినుతికెక్కారు. భారతదేశంలో స్త్రీ మూర్తికి ఇచ్చిన స్థానం ఎంతో ఉన్నతమైనది. భారతమాతగా, భూమాతగా, గంగా మాతగా, తులసీమాతగా… ఇలా తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, అర్ధాంగిగా ఎంతో గౌరవిస్తూ ఇంకా చెప్పాలంటే భార్యలో కూడా అమ్మవారిని చూసుకున్న రామకృష్ణ పరమహంస లాంటి మహోన్నతులు మన ధరణిపై ఉన్నారు. స్త్రీమూర్తి కూడా “కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్జ్యేషు మాత, శయనేషు రంభ” విధంగా తమ పురుషునికి చేదోడు గా ఉన్నారు. ఇంట శుభకార్యాల పిలుపుల లో శ్రీమతి శ్రీ అంటూ ముందుగా స్త్రీ పేరును ఉదహరించడం చూస్తూనే ఉంటాం. మహోన్నతమైన వ్యక్తిత్వం, ఓర్పు, సహనం, ఉన్నతమైన మానసిక పరిణితి స్త్రీ సొంతం. తమకు తమ వారికి ఏదైనా అన్యాయం జరిగితే తెగించి పోరాడి సత్యభామలా నరకుని వధించినట్లు పోరాటం చేస్తుంది. ఇలా మహిళామూర్తికి ఉన్నతమైన స్థానం కల్పించిన భారతీయత ప్రపంచానికి ఒక మార్గదర్శి. విశాల విశ్వంలో భారతీయ స్త్రీ మూర్తి అత్యంత సౌందర్యరాశి. అట్టి శ్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎందరో కవులు కవితలతో కావ్యాలు మలిచారు. మరికొందరు ఆ సౌందర్యమును పొందుటకు యుద్ధాలే చేశారు.

నేటి సమకాలీన ప్రపంచంలో ఎడారి మత ఆచారాలలో వ్యవహారాలలో స్త్రీని బానిసగా, పురుషుల కంటే తక్కువ దానిగా, తమ సంతానాన్ని పెంచే యంత్రంగా భావిస్తున్నారు. చేసే పని ఒకటిగా ఉన్నా ఇచ్చే వేతనంలో భారీ వ్యత్యాసం చూపిస్తున్నారు. లింగ వివక్షత రూపుమాపి లింగ సమానత్వం కోసం యూరప్ దేశాల్లో ప్రారంభమైన మహిళా చైతన్య కార్యక్రమాలు/ పోరాటాలు నేటికీ విజయం సాధించలేక పోవడంతో ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో మహిళల స్వావలంబన కోసం కృషి చేస్తూ ఉన్నాయి. వానిలో భాగంగా ఈ సంవత్సరం మహిళల “సంఘటితం కోసం ప్రేరణ” పేరుతో “ఇన్స్పైర్ ఇంక్లూషన్” థీమ్ కార్యక్రమాలు చేస్తున్నారు.

*అ… అమరావతి ఆ… ఆంగన పోటీ వివరాలు:*

మహిళల సంఘటితం కోసం ప్రేరణ కలిగించడానికి అమరావతి న్యూస్ ఛానల్ సాంప్రదాయక పద్ధతి పై పోటీని మహిళల కోసం నిర్వహించి వారి ద్వారా ప్రపంచానికి భారతీయ మహిళా శక్తిని తెలపడానికి అ… అమరావతి ఆ… ఆంగన పేరుతో సౌందర్యలహరి 2024 పోటీని నిర్వహించగా దేశ విదేశాల్లోని భారతీయ స్త్రీలు 40 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు.

ఇంటిని చూస్తే ఇల్లాలిని అంచనా వేయచ్చని మన వారు చెబుతూ ఉంటారు అట్టి ఇంటి సింహద్వారాన్ని అందంగా అలంకరించి చూపమని, స్త్రీ సౌందర్యమంతా చీరకట్టులోనే ఉంటుంది కాబట్టి అందంగా చీర కట్టుతో కనపడాలని మరియు జీవితంలో కుటుంబ వ్యవహారాల్లో స్త్రీ పాత్ర పై, మీ జీవితంలో స్ఫూర్తి కలిగించిన స్త్రీమూర్తుల వివరాలను తెలుపమని చెప్పడంతో ఎంతో ఉత్సాహంగా మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఇంటి సింహద్వారాన్ని అలంకరింటి, చీరకట్టుతో… మంచి వాగ్దాటితో వారి సందేశాలను ఇవ్వడం అబ్బురము అనిపించింది. న్యాయ నిర్ణయతలచే ఈ పోటీలో పాల్గొన్న వారిలో తొలి ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులను అందించడం, పాల్గొన్న వారికి ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రశంస పత్రం పంపడం జరుగుతుంది.

పై కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలు గా తల్లాడ సాయికృష్ణ ఫిల్మ్ డైరెక్టర్ & హీరో ( నమస్తే సెట్ జీ ఫెమ్) మరియు స్వప్న చౌదరి అమ్మినేని ( యాంకర్ & హీరోయిన్) వ్యవహరించారు. వారు మాట్లాడుతూ అందరికీ ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న అందరికీ అభినందనలు. ప్రతి ఒక్కరూ సౌందర్యలహరి అంటే మీరే అన్నట్లు గ ప్రతి ఒక్కరూ మన సంప్రదాయాల కి అనుగుణంగా అందంగా సింగారించుకుని చక్కగా మాట్లాడారు.అందరూ పోటా పోటీగా పాల్గొని చక్కగా ప్రదర్శన చేశారు. జడ్జిమెంట్ కూడా చాలా కష్టం అనిపించేలా ఒకరికి మించిన ఒకరు ప్రదర్శన లు చేశారు.అందరూ విజేతలె అని పించారు.ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం మక్కు ఇచ్చారు. మహిళ దినోత్సవం సందర్భంగా అమరావతి న్యూస్ వారు ఈలాంటి కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం.ఇలాంటి మంచి మహిళ కి చైతన్య పరిచే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.

పై కార్యక్రమానికి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లుగా చెన్న సాయి కోమలి దేవి,నారాయణం తులసి స్వప్న, ఇమ్మడి సెట్టి సుజాత వ్యవహరించారు.సమాచార సేకరణ రాధ రమణ గుప్త

*విజేతల వివరాలు:*

1) ఫస్ట్ ప్రైజ్. :శ్వేతా,కొవ్వూరు,తూర్పు గోదావరి జిల్లా

2) సెకండ్ ప్రైజ్ :శైలజ,కనిగిరి.ప్రకాశం జిల్లా

3) థర్డ్ ప్రైజ్ : ప్రసన్న , దర్శి,ప్రకాశం జిల్లా

 

*1)ఫస్ట్ వీడియో ఛాలెంజ్*

1) జ్యోతి

*2)న్యూ మెంబర్ జాయిన్ ఛాలెంజ్*

1) మునగ లక్ష్మి కుమారి

2) అరవింద లక్ష్మి

3) జ్యోతి పసుపర్తి

4) అనూష

5) అలేఖ్య

 

*3)Feb-29 స్పెషల్ డే ఛాలెంజ్*

1) జి.ఎన్ జ్యోతి కృష్ణ

2) శ్వేత శ్రీనివాస్

3) రాజేశ్వరి

4) ఎం.లక్ష్మి నాగ రత్తమ్మ

5) టి.శ్రీదేవి

6) శైలజ

7) గీతా లక్ష్మి

8) పొట్ట శ్రీదేవి

9) లల్లి

10) పి.శివ

11) లావణ్య

 

*4)యూట్యూబ్ వ్యూస్ ఛాలెంజ్*

1) రాణి

2) మౌనిక

3) అనూష

 

*5) ఒన్ మినిట్ వీడియో ఛాలెంజ్*

1) సౌజన్య దర్శి

2) సహన

3 ) పానుగంటి

4) జ్యోతి

5) శ్రీలత

6)హరిత

7)సావిత్రి

8)హరిత దుబాయ్

9) శ్రీ

10) శ్వేత

11) శాంత దేవి

12) ప్రియ గుజరాత్

13) అశోక లక్ష్మి

14) కిరణ్ జ్యోతి ,లండన్

15)జయంతి

16)స్వాతి

17)సుమలత

 

*6) స్పెషల్ కేటగిరీ*

1)సూర్య లక్ష్మి ,కెనడా

2)తేజ సాయి రామ్ ,చెన్నై

3)నీలిమ ,పుణె

4)హరిత ,దుబాయ్

5) శాంత లక్ష్మి ,బెంగుళూరు

6) ప్రియ ,గుజరాత్

7)కిరణ్ జ్యోతి ,లండన్

8)పొట్టా శ్రీదేవి ,బెంగుళూరు

 

*7)యూట్యూబ్ వ్యూస్ ఛాలెంజ్-2*

1)తేజ సాయిరాం ,చెన్నై

2) కే సుజాత ,దర్శి

3)అన్నపూర్ణ ,తాడిపూడి

 

 

*8) యూట్యూబ్ వ్యూస్ ఛాలెంజ్-3 వ్యూస్ టార్గెట్ 1k*

1) నళిని

2)జ్యోతి

3)రాజ్యలక్ష్మి

4)స్రవంతి

 

*9)సౌందర్యలహరి ఫైనల్ విన్నర్స్*

1) ఫస్ట్ ప్రైజ్. :శ్వేతా,కొవ్వూరు

2) సెకండ్ ప్రైజ్ :శైలజ,కనిగిరి.

3) థర్డ్ ప్రైజ్ : ప్రసన్న ,దర్శి

 

 

 

 

 

*పోటీల్లో పాల్గొన్నవారు మరియు వారి ఫోటోలు*

 

*Total Participation List*

1) జ్యోతి

2) పద్మావతి

3) మౌనిక

4) నళిని

5) ఇందిర

6) స్రవంతి

7) అనూష

8) అరుణ

11) చూడా మని

10) వాసవి

12) అన్నపూర్ణ

13) సుజాత

14) లావణ్య

15) రాజ్యలక్ష్మి

16) పద్మ

17) శ్రావణి

18) అరవింద

19) జ్యోతి

20) శ్వేత

21) రాజేశ్వరి

22) నాగరత్తమ్మ

23) టి .శ్రీదేవి

24) శైలజ

25) గీతాలక్ష్మి

26) లల్లి

27) శివకుమార్

28) అనూష

29) ప్రసన్న

30) సుజాత

31) సూర్య మీనాక్షి కెనడా

32) శ్యామల

33) శాంత లక్ష్మి

34) సుధ

35) తేజ చెన్నై

36) శ్రావణి

37) రాణి

38) శిరీష

39) నీలిమ పుణె

40) సీత

41) మంజు భార్గవి

42) ప్రియ గుజరాత్

43) సావిత్రి

44) హరిత

45) శ్రీ ఏలూరు

46) శ్వేత బిందు

47) శ్రీలత

48) జ్యోతి

49) సాయి అనసూయ

50) ప్రియ

51) వాసవి

52) సౌజన్య

53) సౌమ్య

54) సావిత్రి

55) అశోక లక్ష్మి

56) శారద దేవి

57) అలేఖ్య

58) సహన

59) కిరణ్ జ్యోతి

61) జయంతి

62 ) స్వాతి

63) సుమలత

64) పొట్ట శ్రీదేవి

o

Leave A Reply

Your email address will not be published.