Dayle Breaking News

జాతీయ ఉత్తమ మహిళామణి పురస్కారానికి తేళ్ళ అరుణ ఎంపిక.

పలువురు సాహితీ మిత్రుల అభినందన

0 523

ఒంగోలు::

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖులైన మహిళా మణులకి ఇచ్చే అత్యున్నత జాతీయ స్థాయి ఉత్తమ మహిళామణి పురస్కారానికి కళామిత్రమండలి అవార్డ్స్ కమిటీ చైర్మన్ మరియు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ళ అరుణను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు “శ్రీ భం సాయి సేవా ట్రస్ట్ “మరియు “భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్” నిర్వాహకులు, ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ యం.నరసింహప్ప మరియు కళారత్న డాక్టర్ బిక్కికృష్ణలు ఒక వర్తమానాన్ని పంపారు.

ఈ పురస్కారాన్ని ఈనెల 10 తేదీన ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామని తెలిపారు. ఈసందర్భంగా పురస్కారానికి ఎంపికైన అరుణకు కళామిత్రమండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీ కృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు, మిడసల మల్లిఖార్జునరావు, డా సంతవేలూరి కోటేశ్వరరావు, యు.వి.రత్నం, మాగంటి శ్రీనివాస మూర్తి, యం.సూర్యకుమారి, డాక్టర్ మున్నంగి రాజకుమారి, కె.బాలకోటయ్యలు అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.