Dayle Breaking News

సామాజిక సేవలలో అగ్రగామి ఫ్యామిలి క్లబ్.

- క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు. - ఘనంగా క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం.

0 292

 

 

ఒంగోలు::

ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం సంస్థ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు మాట్లాడుతూ ఫ్యామిలీ క్లబ్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో ఆనందాలు, ఎన్నో మధురమైన సంఘటనల సమూహాలను ప్రోది చేసుకోవడం జరిగినదని తెలిపారు. నా జీవితానుభవంలో ఎన్నో సామాజిక సేవా సంస్థల్లో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తూ వస్తున్నా ఫ్యామిలీ క్లబ్ స్థాపించడంలో అనంతమైన ఆనందం లభించినదని తూలిపారు. మన మనసున కలిసిన మిత్రులందరూ కుటుంబ సమేతంగా ఒకే వేదికపై ఆనందానుబూతులు పంచుకొంటూ… ఒకరికొకరు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ… ఈ జీవితం ఎంతో ఆనందంగా… సాగిపోవాలనే భావనతో ఈ క్లబ్ ను స్థాపించడం జరిగిందని తెలిపారు.

సంస్థ ద్వారా ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంస్థకు ఆర్థిక పరిపుష్టత చేకూర్చారని ఇలాగే రాబోవు కాలంలో మరింత ఉన్నతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి చేరే విధంగా కృషి చేయాలని సభ్యులకు తెలిపారు. జీవితంలో అన్ని ఒడిదుడుకులను అధిగమిస్తూ ఆనందంగా అందరితో కలిసి మెలసి సాగిపోవాలని మనసారా ఆకాంక్షించారు.

తాళ్లూరి శ్రీనివాసరావు, కొత్తూరు సురేష్, తుమ్మపూడి పాండురంగారావు, తుమ్మపూడి వెంకటేశ్వర్లు, మద్దాలి మధు, సిహెచ్ రంగ సుబ్రహ్మణ్యం, సొల్లేటి రాము, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కొత్తూరి చంద్రమౌళి, పువ్వాడ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.